కడప జిల్లా: గోపవరం మండలం పి.పి.కుంట జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. బద్వేల్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడిని బద్వేల్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు.
బాపట్ల జిల్లా: మార్టూరులో మైనింగ్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ ముడి రాయి వాహనాలను స్వాధీనం చేసుకొని, మార్టూరు పీఎస్‌కు తరలించారు.
కర్నూలు జిల్లా: బనగానపల్లె మండలం ఎర్రగుడిలో లక్ష్మీనారాయణ, రాములమ్మ అనే దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వేధిస్తున్నారని ఎస్పీకి లేఖ రాసి, అనంతరం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
*ఎమ్మిగనూరు పట్టణంలోని ముగతిపేటలో సురేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు వివాహానికి వెళ్లి ఇంటికి తిరిగి రాగా.. కుమారుడు శవమై కనిపించాడు. మృతుడి భార్య మహాలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ వెళ్లి పరిశీలించారు.