Police Solve The Cell Phones And Laptops Theft Case : హరియాణా నుంచి చెన్నైకి సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ నుంచి కోట్లు విలువ చేసే మొబైల్ ఫోన్లు దొంగలిచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 23న కడప శివారులో కంటైనర్‌ను ఆపి డ్రైవర్ల సాయంతో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. కడప చిన్నచౌక్ స్టేషన్‌లో బ్లూడాట్ కొరియర్ సంస్థ ఫిర్యాదు ఇవ్వగా... 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల నుంచి 1 కోటి 58 లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది : Cell phones and laptops theft from container: హరియాణాకు చెందిన కంటైనర్లో చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయలు విలువచేసే సెల్‌ఫోన్లు, ల్యాప్ట్యాప్లు ఆ కంటైనర్లో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పది రోజులు క్రిందట ముంబై నుంచి చెన్నైకి కంటైనర్ బయలుదేరింది. కంటైనర్లో ఉన్నసామాగ్రిని కంటైనర్ డ్రైవరే చోరీకి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.