Old Woman Murder: బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపిన ఘటన చినపులివర్రు గ్రామంలో జరిగింది. గుడిపల్లి లక్ష్మీ విలాసం(70) అనే వృద్ధురాలు ఇంటిలో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు కర్రతో దాడి చేసి.. హతమార్చి పెన్షన్ నగదు తీసుకుని పరారయ్యారు. ముగ్గురు స్థానికులను అనుమానితులుగా భావిస్తున్నారు. మద్యం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మద్యానికి డబ్బులు లేక వృద్ధురాలిపై దాడి.. ఆ తర్వాత - నేర వార్తలు
Murder for Pension: మద్యం కోసం ప్రాణాలు తీశారు ముగ్గురు వ్యక్తులు. ఓ వృద్ధురాలి దగ్గర పెన్షన్ డబ్బులు చూసి.. ఎలాగైనా కొట్టేయాలనుకున్నారు. ఆమెపై ముగ్గురు కర్రతో దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. ఈ దారుణం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో చోటు చేసుకుంది.
హత్య