రెండు తెలుగు రాష్ట్రాలలో హెటిరో డ్రగ్స్ సంస్థలపై (Hetero Drugs Companies) ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు (IT Raids) తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో 20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను (IT Raids) చేపట్టారు.
IT Raids on Hetero: హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు - telangana news
రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో సోదాలు
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సుమారు 25 మంది సభ్యులతో కూడిన బృందం నక్కపల్లిలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
ఇదీ చూడండి:DASARA HOLLYDAYS: 11 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
Last Updated : Oct 6, 2021, 3:39 PM IST