ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

AUTO FIRE: జీవనోపాధి కల్పించే ఆటోను తగలబెట్టేశాడు.. ఎందుకంటే? - telangana varthalu

రోజంతా వాహనం నడిపితేనే వాళ్ల కడుపు నిండుతుంది. ఫైనాన్స్​లో వాహనం తీసుకుంటే సగం దానికే వెళ్లిపోతుంది. డబ్బుల కోసం ఫైనాన్షియర్​ వేధింపులు తాళలేక ఓ డ్రైవర్​ తన ఆటోను తగులపెట్టుకున్న ఘటన తెలంగాణలోని హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పెరుగుతున్న పెట్రోల్​ ధరల దృష్ట్యా డబ్బులు కట్టలేక జీవనోపాధి కోల్పోయానని ఆటో డ్రైవర్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

driver set the auto on fire in hanmakonda
జీవనోపాధి కల్పించే ఆటోను కాల్చేశాడు

By

Published : Aug 28, 2021, 6:27 PM IST

నడిరోడ్డు మీద ఆటోను కాల్చేశాడు

తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో ఫైనాన్షియర్‌ వేధింపులతో.. ఓ డ్రైవర్ తన ఆటోను తగులపెట్టుకున్నాడు. డబ్బుల కోసం రోజూ ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. కాళోజి కూడలి వద్ద శ్రీనివాస్‌ అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసి వాహనానికి నిప్పంటించాడు. నడిరోడ్డుపై ఆటో తగలబడుతుండగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది.

కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డానని.. కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గిరాకీ లేదని.. పెట్రోల్‌ ధరల పెరుగదల వల్ల ఏమీ మిగలడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. ఫైనాన్స్​ వాళ్లు కూడా డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆటో డ్రైవర్​ వాపోయాడు. అందుకే ఈ పని చేసినట్టు ఆవేదన చెందాడు.

ABOUT THE AUTHOR

...view details