విశాఖపట్నంలోని గాజువాక ఎంవీఆర్ షాపింగ్ మాల్లో.. ఈ మధ్య జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను... ఇరానీ గ్యాంగ్‌కు చెందినవారని అనుమానం వ్యక్తం చేశారు. వారి జాడ తెలుసుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్టు క్రైమ్ సీఐ అవతారం తెలిపారు. గత నెల 29న ఈ ఘటన జరిగింది. సేల్స్ మన్ను మాటల్లో పెట్టిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పదిన్నర తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకు పోయారు.
షాపింగ్ మాల్లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం
గాజువాక ఎంవీఆర్ షాపింగ్ మాల్ జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
షాపింగ్ మాల్లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం