ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపాలో చేరిక'పై గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే?

తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. పార్టీ మారుతున్నారా? తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయన అధికారం చేపట్టబోతన్న వైకాపాలో చేరుతున్నారా? ఈ ప్రశ్నలకు గంటా ఏమంటున్నారు?

By

Published : May 26, 2019, 1:29 PM IST

గంటా శ్రీనివాసరావు

'వైకాపాలో చేరిక'.. గంటా వివరణ

విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెదేపా శాసనసభ్యుడిగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. గతంలో ప్రజారాజ్యంలోకి వెళ్లినా.. అటు నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినా.. చంద్రబాబును ఉద్దేశించి ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం తాను పార్టీ మారే అవకాశాలే లేవని తేల్చి చెప్పారు. ఇక తన పూర్తి రాజకీయ జీవితం.. తెదేపాతోనే, చంద్రబాబుతోనే అని స్పష్టం చేశారు. పడి లేచిన కెరటంలా తెదేపా మళ్లీ బలం పుంజుకుంటుందని చెప్పారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో.. గంటా ఈ వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details