రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన, శాసన నిర్మాణం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలను వికేంద్రీకరించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా నగరంలోని ఐటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరించడం వలన అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దిశ చట్టం మహిళలకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఐటీ రంగాల్లో అధిక సంఖ్యలో పనిచేసే అతివలకు మరింత భద్రత అవసరమన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని రావడం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
'పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి'
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన, శాసన నిర్మాణం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలను వికేంద్రీకరించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని రావడం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
విజయసాయిరెడ్డి