ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థికమంత్రి​.. కార్మిక సంఘాల నేతల ముందస్తు అరెస్ట్​ - steel union leaders arrest in vishaka

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

steel union leaders arrest
కార్మికసంఘాల అరెస్ట్​

By

Published : Aug 6, 2021, 5:37 PM IST

Updated : Aug 6, 2021, 7:27 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. నిర్మలా సీతారామన్​ పర్యటనను అడ్డుకుంటామని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విశాఖ స్టీల్ పరిరక్షణ సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్ట్​ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కార్మిక సంఘ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో పాటు.. పలువురిని హౌస్​ అరెస్ట్​ చేశారు.

కార్మికసంఘాల అరెస్ట్​

అయితే ఎయిర్​పోర్ట్​ దగ్గరకు పలువురు చేరుకుని నిర్మలా సీతారామన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఎయిర్ పోర్ట్​లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కార్మికసంఘాల నేతలు, ఉద్యోగులను అరెస్టు చేశారు. అయితే కార్మికుల ఉద్రిక్తతతో విమానాశ్రయం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

విశాఖ చేరుకున్న నిర్మాలా సీతారామన్

ఉత్తరాంధ్రలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్టు అతిథి గృహంలో భాజపా ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు.. ఇతర నేతలు కలిశారు. అలాగే అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిర్మలా సీతారామన్​తో భేటీ కానున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి.. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. విశాఖ నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ తిరిగి పయనమవుతారు.

ఇదీ చదవండీ..ap cabinet meet: కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే..

Last Updated : Aug 6, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details