ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో క్రైం చేయాలంటే.. నేరస్తులు ఆలోచించాల్సిందే..!

విశాఖలో నేరం చేయాలంటే కచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎక్కడ ఏ విధమైన అశాంతి సృష్టించినా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఇటీవలి కాలంలో పోలీసులు ఛేదిస్తున్న వరుస కేసులు నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. సాగర నగరికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడి శాంతిభద్రతలకు ఏ మాత్రం విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

police special concentration on vishaka
police special concentration on vishaka

By

Published : Nov 12, 2020, 2:57 PM IST

విశాఖలో పోలీసులు నేరాల నియంత్రణపై పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దర్జాగా విమానంలో వచ్చి విశాఖలో ఓ ఏటీఎంను గ్యాస్ కట్టర్​తో కట్ చేసి లక్షల రూపాయలు దోచేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నేరస్తులు ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దొంగతనం చేసిన 35గంటల్లోనే వారిని బెంగళూరులో అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. ఇలాంటి ఛేదనలు నేరస్తులకు ఓ గట్టి హెచ్చరికల లాంటిదని పోలీసులు చెబుతున్నారు. నగరంలో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. అందులో కొందరిని బైండోవర్ కూడా చేశారు. విజిబుల్ పోలీసింగ్​ను మరింత సమర్థంగా అమలు చేస్తామని చెబుతున్నారు.

నగరంలో ఎక్కడ ఏం జరుగుతున్నా పోలీసు నిఘాలో ఉండే విధంగా సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. ఆటో వాలాల కోసం ఓ ప్రత్యేక సాఫ్ట్​వేర్​ను రూపొందించి వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. ఫలితంగా నకిలీ ఆటో డ్రైవర్లను గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళల్లోను తిరిగేందుకు గుర్తింపు ఉన్న ఆటోల్ని మాత్రమే అనుమతించడం ద్వారా కొన్ని తరహా నేరాలకు అడ్డుకట్ట వేయనున్నారు. మరోవైపు పెట్రోలింగ్ వ్యవస్థపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ట్రాఫిక్ విభాగం పరిధిలో ఉండే 15 హైవే పెట్రోలింగ్ వెహికల్స్​ను లా అండ్ ఆర్డర్​లోకి తీసుకున్నారు. నిరంతర నిఘాతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందనే ఆలోచనతో ముందుకెళుతున్నారు. మహిళల కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ వినియోగాన్ని సైతం పెంచాలని పోలీసులు కోరుతున్నారు.

బహిరంగ మద్యపానం వంటి వాటిని నియంత్రించే దిశగా ప్రత్యేక డ్రైవ్​లు సైతం నిర్వహిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో 15 వందల మందిని ఈ కేసుల్లో అరెస్టు చేశారు. ప్రజలకు శాంతి భద్రతల పరంగా ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే సమాచారం ఇస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details