రాష్ట్రంలో పరిపాలన విధానాలపై ఎలక్షన్ కమిషన్కు ఐఏఎస్, ఐపీఎస్లు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితులు ఎదురయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను కాంగ్రెస్ నేతలు తగులబెట్టారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని శైలజనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిపాలన స్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఇందుకు తగ్గట్టుగా నాయకత్వ లోపం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఓటర్లను భయపెట్టి ఎన్నికలు ఏకగ్రీమయ్యేలా అధికార పార్టీ చూస్తోందని మండిపడ్డారు.