ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2019, 9:28 PM IST

Updated : Jan 21, 2020, 2:47 PM IST

ETV Bharat / city

చంద్రబాబుకు పవన్ ఫోన్ ... అందుకే ..!

భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా వచ్చే నెల 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కూడగట్టేందుకు... ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలు రాజకీయపార్టీల అధినేతలతో ఫోన్​లో మాట్లాడారు. ఇవాళ చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్​... ఇసుక సమస్యపై కలిసిపోరాడదామన్నారు. విశాఖ ర్యాలీకి తెదేపా మద్దతు కోరారు. పవన్ విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే జనసేన ర్యాలీలో భాజపా పాల్గొవడంలేదని తెలుస్తోంది.

చంద్రబాబుకు పవన్ ఫోన్ .. అందుకే ..!

చంద్రబాబుకు పవన్ ఫోన్ ... అందుకే ..!

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడేందుకు.. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరింత చొరవ చూపారు. అన్ని పార్టీల అగ్ర నాయకులతో స్వయంగా ఫోన్​లో మాట్లాడారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎలాంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా పోరాడాలని పవన్ అన్నారు. నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీ​కి తెదేపా మద్దతు తెలపాలని చంద్రబాబును కోరారు. పవన్ విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

కలిసిరండి...!

ఇసుక సమస్యపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో.. పవన్ మాట్లాడారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విశాఖలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని కన్నాను ఆహ్వానించారు. అందుకు కన్నా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ భాజపా శ్రేణులు ర్యాలీలో పాల్గొవడంలేదని తెలుస్తోంది. సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, బీఎస్పీ అధ్యక్షుడు సంపత్‌రావుతో పవన్ మాట్లాడారు. జనసేన లాంగ్ మార్చ్​లో కార్యకర్తలతో కలసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జనసేన ర్యాలీకు ఆహ్వానించినందుకు ఆయా పార్టీల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

'ప్రభుత్వ తీరుతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు'

Last Updated : Jan 21, 2020, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details