ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PALLA PAADAYATRA: 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ పోరాడాలి'

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వాసిత గ్రామాల్లో తెదేపా చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మెుదటగా నష్టపోయేది నిర్వాసితులేనని తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వారికి బాసటగా నిలవటం కోసమే పాదయాత్ర చేపట్టామని ఆయన వెల్లడించారు.

palla srinivasa rao comments on jagan over steel plant privatization
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ పోరాడాలి'

By

Published : Jul 31, 2021, 4:25 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తూ..పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మెుదటగా నష్టపోయేది నిర్వాసితులేనని పల్లా అన్నారు. వారికి బాసటగా నిలవటం కోసమే పాదయాత్ర చేపట్టామని.. తెదేపా పార్టీ తరపున వారికి అండగా ఉంటామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన సీఎం జగన్..ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని సూచించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా బాసటగా నిలవటం స్ఫూర్తినిస్తోందని నిర్వాసితులు అంటున్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణతో విశాఖ అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. స్టీల్ ప్లాంటు కోసం భూములిచ్చిన వారిని రోడ్డు పాలు చేయటం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details