ఇదీ చదవండి:
రాయితీ ఉల్లి కోసం చీకటిలో విశాఖ వాసుల పాట్లు
రాష్ట్రంలో ఉల్లి లొల్లి కొనసాగుతోంది. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ప్రజల నిరీక్షణ కొనసాగుతోంది. రాత్రనక, పగలనక రైతు బజార్లలో ఉల్లి కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. విశాఖలోని గోపాలపట్నం రైతు బజారు వద్ద ప్రజలు రాయితీ ఉల్లి కోసం చలిలో క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లలో వేచి చూస్తూ చీకటిలో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. చీకటిలో అక్కడి వారు పడుతోన్న దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న వివరాలివి..!
ఉల్లికోసం ప్రజల విశాఖ వాసుల పడిగాపులు