ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉత్సవ్​ను అట్టహాసంగా నిర్వహిస్తాం' - విశాఖ ఉత్సవ్​ వార్తలు

విశాఖ ఉత్సవ్​ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. కార్నివాల్, లేజర్​షో, దేవీశ్రీప్రసాద్, తమన్​ల సంగీత విభావరి, ఫ్లవర్​షో వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

minister srinivas about vishaka ustav
ప్రచార చిత్రం విడుదల

By

Published : Dec 24, 2019, 12:29 AM IST

విశాఖ ఉత్సవ్​ను అట్టహాసంగా నిర్వహిస్తామన్న మంత్రి అవంతి

విశాఖ ఉత్సవ్​ను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి బొత్స సత్య నారాయణ విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి రెండు రోజుల పాటు జరిగే వేడుక కోసం విస్తృత ప్రచారం చేస్తున్నామని మంత్రి అవంతి చెప్పారు. ఇదే సమయంలో ఈనెల 28న కైలాసగిరిపై వీఎంఆర్డీఏ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్​లో ఫ్లవర్​షోనూ ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖ ఉత్సవ్ మొదటి రోజు బీచ్​లో కళాకారులతో కార్నివాల్ ఉంటుందని, విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉత్సవ్​లో దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ సంగీత విభావరి ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details