విశాఖపట్టణం, హైదరాబాద్లోని పలు సంస్థలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఓ సినీ ప్రొడక్షన్ కార్యాలయంపైనా సోదాలు చేపట్టగా... పెండింగ్లో ఉన్న బకాయి రూ.60 లక్షలు యాజమాన్యం చెల్లించినట్లు సమాచారం. మరో కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీపై సైతం దాడులు నిర్వహించింది. సుమారు రూ.5 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు.
అలాగే పలు ఎలక్ట్రానిక్ సంస్థలపై దాడులు చేశారు. రెండు కోట్లకుపైగా జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీపై దాడులు చేసి భారీగా టాక్స్ ఎగవేసినట్లు అధికారులు నిర్థరించినట్లు తెలుస్తోంది. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగంతో పాటు నాలుగు కేంద్ర జీఎస్టీ కమిషనరేట్ పరిధిలోని అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?