విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు త్యాగాలకు గుర్తని తెలిపారు. విశాఖ ఉక్కు రక్షణకు ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి అంతా కలిసి రావాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్‌ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం'- మెగాస్టార్ చిరంజీవి