వాడుక భాషకు సమగ్రమైన వ్యాకరణం రూపొందించాల్సిన అవసరం ఉందని తెలుగు ఊపిరి అధ్యక్షులు సూర్యారావు అభిప్రాయపడ్డారు. గిడుగు వెంకట రామమూర్తి వర్ధంతిని పురస్కరించుకుని... 'తెలుగు వ్యవహారిక భాషా వ్యాకరణ నిర్మాణం' అనే అంశంపై విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు వాడుక భాష, నుడికట్టు కూర్పుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాకరణ కూర్పుపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
'వాడుక భాషకు సమగ్ర వ్యాకరణ రూపొందించాలి' - తెలుగు వ్యాకరణంపై విశాఖలో సమావేశం
వాడుక భాషకు సమగ్రమైన వ్యాకరణం రూపొందించాల్సిన అవసరం ఉందని తెలుగు ఊపిరి అధ్యక్షులు సూర్యారావు అభిప్రాయపడ్డారు. 'తెలుగు వ్యవహారిక భాషా వ్యాకరణ నిర్మాణం' అనే అంశంపై విశాఖలో సమావేశం నిర్వహించారు.
తెలుగు వ్యాకరణంపై విశాఖలో సమావేశం