విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ కలకలం రేపుతోంది. మన్యంలో పోలీసుల జులుంతో గిరిజనులు సతమతమవుతున్నారని తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం లేఖలో పేర్కొన్నారు. అటవీ శాఖ అనుబంధంగా పని చేస్తున్న ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలోని కాఫీ తోటలపై హక్కు కల్పించాలంటూ గిరిపుత్రులు పోరాటం చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. గిరిజనులను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మే 1న పనసనొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాల్లో దాడులు చేసి రైతులను అక్రమంగా నిర్బంధిచారని...వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు చేయటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
విశాఖ మన్యంలో.. మావోయిస్టుల పేరిట లేఖ - మావోయిస్టు లేఖ
మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ లభ్యమైంది. గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని... రైతులను మావోయిస్టు సానుభూతిపరుల పేరిట నిర్బంధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంకా పలు అంశాల గురించి వివరించారు.
'విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ'