విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధికార ప్రతినిధికంభంపాటి హరిబాబు విశాఖలో తీవ్రంగా మండిపడ్డారు. తల లేని మొండెం లాంటి రైల్వే జోన్ ఇచ్చి విమర్శలు చేస్తోన్న గోయల్ కు ఒక్కరోజు సైతం పదవిలో కొనసాగే అర్హత లేదని ఆక్షేపించారు. హక్కులను కాలరాసే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరని ఉద్ఘాటించారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తర్వాతే భాజపా నేతలు రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. మోదీ, కేసీఆర్‌తో కుమ్మక్కైన జగన్‌కు ఈ సారి ప్రతిపక్ష హోదా సైతం దక్కదని మండిపడ్డారు.
పీయూష్ గోయల్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు: కంభంపాటి - కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్
విభజన హామీలు అమలు చేయని కేంద్ర భాజపా నేతలకు రాష్ట్రంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. విశాఖ రైల్వో జొన్పై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. తలలేని మొండెంలాంటి రైల్వే జోన్ ఇచ్చారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయనకు కేంద్ర మంత్రిగా పదవిలో కొనసాగే అర్హతలేదు. - కంభంపాటి రామ్మోహన్, తెదేపా అధికార ప్రతినిధి
కంభంపాటి రామ్మోహన్ రావు