విశాఖ రైల్వేస్టేషన్లో హ్యూమన్ ఇంట్రాక్ట్ ఇంటర్ఫేస్(హాయ్)ను ఏర్పాటు చేశారు. ఇది స్మార్ట్ డిజిటల్ కియోస్క్, డిజిటల్ బిల్ బోర్డు కలిపి ఉండేలా సేవలందించే ఓ సిస్టమ్. ఒకటో నంబర్ ప్లాట్ఫారం మీద ఏర్పాటు చేసిన వీటిని వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, స్టీల్ ప్లాంట్ సీఎండీ ప్రదోష్ కుమార్ రత్లు ప్రారంభించారు. ఇవి రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చి... ప్రయాణికుల అవసరాలను తీరుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
హాయ్ అందించే సేవలు ఇవే
- 10 నుంచి 15 నిమిషాల్లోనే మొబైల్స్ ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాప్ట్యాప్స్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
- ఫోన్లు అందుబాటులో లేని వ్యక్తులు తమ వారికి వీటి ద్వారా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు
- రైళ్ల రాకపోకల టైం టేబుల్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కియోస్క్లోని ఎల్ఈడీ తెరల్లో కనిపిస్తుంది
- గూగుల్ మ్యాప్స్, సిటీ మ్యాప్లు ఇందులో పొందుపరిచారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ ప్రాంతం ఎంతదూరంలో ఉందో ప్రయాణికులు తెలుసుకోవచ్చు