మోదీ సభకు భారీ భద్రత - high security
విశాఖలో మార్చి 1 న నిర్వహిస్తున్న భాజపా బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పరిశీలించింది. ప్రధాని మోదీ హాజరుకానున్న ఈ సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
విశాఖలోని రైల్వే మైదానంలో మార్చి 1 న భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఎస్పీజీ బృందం భద్రత చర్యలను కట్టుదిట్టం చేయనుంది. సభ నిర్వహిస్తున్న మైదానాన్ని సిబ్బంది సందర్శించారు.భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఎస్పీజీ బృందంతో పాటు కలెక్టర్ భాస్కర్, సీపీ మహేశ్ చంద్రలడ్డా ఇతర శాఖల అధికారులు మైదానానికి వెళ్లారు.
Last Updated : Feb 26, 2019, 3:18 PM IST