ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఇసుక కొరత, జీఎస్టీ చెల్లింపుల్లో పనులు నిలిపివేత కారణంగా మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో అనేక పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకోకుంటే పరిస్ధితి మరింత దారుణంగా మారనుందని మహా విశాఖ నగర పాలక సంస్థ గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తంగా 393 కోట్ల మేర వివిధ కారణాల వల్ల పనులు నిలిచిపోయాయని గుత్తేదారులు తెలిపారు. ఇసుక ఉచితంగా సరఫరా అవుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా ఆ పరిస్థితులు నగరపాలక సంస్థ పరిధిలో లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా రివర్స్ టెండరింగ్‌తో పనులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా... పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 193 కోట్ల రూపాయల మేర 684 పనులు నిలిచిపోయాయని గుత్తేదారుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ప్రభుత్వ జీవోలతో.. పనులు స్తంభించాయి' - sand
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 72 వార్డులు, భీమునిపట్నం, అనకాపల్లి పట్టణాల్లో అనేక పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం తన నిర్ణయాలతో ఇసుక రేట్లను అమాంతం పెంచేసిందని గుత్తేదారులు బాధపడుతున్నారు. ఉచిత ఇసుక సరఫరా చేస్తుందని చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఇక్కడ ఎలాంటి వాతావరణం కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ప్రభుత్వ జీవోలతో పనులు స్తంభించాయి'