వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినట్టు జీవీఎంసీ కమిషనర్ సృజన చెప్పారు. సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆమె వెల్లడించారు. ముంపు ప్రాంతాల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వర్షాల వల్ల పాత డ్రైన్ వ్యవస్థలు చెడిపోయినట్టు పేర్కొన్నారు. వాటికి కూడా మరమ్మతులు చేసి.. ప్రజలకు అసౌకర్యం లేకుండా చూస్తున్నట్టు విశాఖ మహానగర పాలక సంస్థ కమిషనర్ సృజన అన్నారు.
వర్షాలతో ఒక్క రోజుకి ఏడుకోట్ల నష్టం: జీవీఎంసీ కమిషనర్ - విశాఖపై వర్షం ఎఫెక్ట్ వార్తలు
వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ఒక్క రోజుకి ప్రాథమిక అంచనాలో ఏడుకోట్ల నష్టం వచ్చిందని విశాఖ మహానగర పాలక సంస్థ కమిషనర్ సృజన తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు త్వరలో మరమ్మతులు చేస్తామని చెప్పారు.
వర్షాలతో ఒక్క రోజుకి ఏడుకోట్ల నష్టం: జీవీఎంసీ కమిషనర్వర్షాలతో ఒక్క రోజుకి ఏడుకోట్ల నష్టం: జీవీఎంసీ కమిషనర్