ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పర్యావరణ ఆవశ్యకత తెలియజేసే క్యాలెండర్​ ఆవిష్కరణ - గ్రీన్ క్లైమేట్ క్యాలెండర్​

పర్యావరణాన్ని కాపాడేందుకు సంవత్సరంలోని ముఖ్యరోజులతో పాటు దానిపై ఆవశ్యకతను తెలియజేస్తూ 'గ్రీన్ క్లైమేట్ బృందం' క్యాలెండర్​ ఆవిష్కరించింది. పర్యావరణ పరిరక్షణ దినాలను గుర్తించే విధంగా దీన్ని రూపుదిద్దారు. భూగోళం మీద ఉన్న జీవావరణం దెబ్బతీయకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని బృందం సభ్యులు వెల్లడించారు.

green climate calendar released in visakha
'గ్రీన్ క్లైమేట్ బృందం' క్యాలెండర్​

By

Published : Jan 9, 2021, 7:00 PM IST

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వెల్లడించే క్యాలెండర్​ను గ్రీన్ క్లైమేట్ బృందం రూపొందించింది. విశాఖ పౌర గ్రంథాలయంలో ఈ క్యాలెండర్​ను పర్యావరణ కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికుల సమక్షంలో ఆవిష్కరించారు.

'గ్రీన్ క్లైమేట్ బృందం' క్యాలెండర్​

భూగోళం మీద ఉన్న జీవావరణం కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్న సందర్భంలో సంవత్సరంలోని పర్యావరణ పరిరక్షణ దినాలను గుర్తించే విధంగా ఈ క్యాలెండర్ రూపుదిద్దారు. ప్రధానంగా అంతర్జాతీయ పర్యావరణ దినం, ప్రపంచ వన్యప్రాణుల దినం, అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ, జాతీయ కాలుష్య నియంత్రణ దినం, వంటి అనేక పర్యావరణ పరిరక్షణ దినాలను ఇందులో పొందుపరిచారు. వీటిని అందరు గుర్తించే విధంగా ఈ క్యాలెండర్​ను తీర్చిదిద్దినట్టు గ్రీన్ క్లైమేట్ బృందం ప్రతినిధులు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర ఆచార్యురాలు సిహెచ్ హేమలత, ఏఎస్ రాజా కళాశాల జంతుశాస్త్ర జూనియర్ లెక్చరర్ కె.వి విజయ్ కుమార్, గ్రీన్ క్లైమేట్ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సేవే మార్గం.. గిన్నిస్​బుక్​లో స్థానం

ABOUT THE AUTHOR

...view details