పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా... విశాఖ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలసి గవర్నర్ కొవ్వొత్తులు వెలిగించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.
దేశంలో పోలీసుల పాత్ర కీలకమైందని... సమాజానికి సేవ చేయడం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. విపత్తు సమయాల్లో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.