విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ నుంచి విడుదలైన గాఢ వాయువు ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాతావరణం మార్పుతో కోరమండల్ పరిశ్రమ నుంచి వాయువును బయటకు విడిచిపెట్టారు. చల్లదనం ఎక్కువగా ఉన్నందున వాయువు గాలిలోకి వెళ్లకుండా చుట్టుపక్కల కాలనీల్లోకి వ్యాపించింది. ఒక్కసారిగా ఘాటైన వాసన రావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు.
పిలకవాని పాలెం, కుంచుమాంబ కాలనీలో ఈ ఘాటైన వాయువు ప్రభావం కనిపించింది. సాయంత్రం నుంచి సమస్య తీవ్రత తగ్గకపోవడంతో స్థానికులు పరిశ్రమ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కోరమాండల్ ఉద్యోగులు స్థానికులతో మాట్లాడారు. పరిశ్రమ ప్రతినిధులపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పటిష్టమైన చర్యలు లేకపోతే తమకు ప్రాణహాని పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాయువు ప్రభావంతో ఇబ్బందిపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
మంత్రి గౌతం రెడ్డి ఆరా...