విశాఖపట్నం పర్యటన సమయంలో చంద్రబాబును అడ్డుకున్నానని సీఎం జగన్ సంబరపడుతున్నారని.. అయితే విశాఖ పోలీసులకున్న మంచిపేరుపై మచ్చపడేలా చేశారని మాజీ ఎంపీ సబ్బం హరి విమర్శించారు. చంద్రబాబును అడ్డుకున్నవారిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నమే చేయలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే.. జగన్ పాదయాత్ర చేసేవారే కాదని సబ్బంహరి అన్నారు.
'విశాఖ పోలీసులకున్న మంచిపేరుపై మచ్చపడేలా చేశారు' - former mp sabbam hari talks about vizag incident latest news
చంద్రబాబు యాత్ర సమయంలో జరిగిన ఘటనతో విశాఖ పోలీసుల మీద ప్రజలకున్న నమ్మకం పోయిందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. చంద్రబాబును అడ్డుకున్నవారిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నమే చేయలేదన్నారు.
సబ్బం హరి