పట్టుదల, కృషితో ఏదైనా సాధించొచ్చు - పూర్ణ
తన జీవితంలోని అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ఎవరెస్టు అధిరోహించినట్లు మలావత్ పూర్ణ గుర్తుచేసుకుంది. విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల యజమాన్యం ఆమెను సత్కరించింది.
కృషి ,పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే విజయ అవకాశాలు తమ సొంతమవుతాయని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తెలిపింది. తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని తాను ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినట్లు గుర్తు చేసుకుంది. విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది. తమ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో ఎత్తుకు ఎదిగిన పూర్ణను సత్కరించుకోవటం ఆనందంగా ఉందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. జీవితంలో ఏది సాధించాలనుకున్నా...చదువును మాత్రం అశ్రద్ధ చేయరాదని పూర్ణ సూచించింది.