ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎలాంటి మార్పునకైనా సన్నద్ధం కావాలి: డీజీపీ సవాంగ్

పోలీసు శాఖలో ఇప్పటివరకు 466 మంది కరోనా బారిన పడ్డారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న పోలీసుల పనితీరును ప్రశంసించారు.

dgp gowtham sawang
dgp gowtham sawang

By

Published : Jul 5, 2020, 6:54 PM IST

Updated : Jul 6, 2020, 6:30 AM IST

కరోనా వ్యాప్తిపై మాట్లాడుతున్న డీజీపీ

కరోనా నియంత్రణలో పాల్గొన్న విశాఖ పోలీసులను రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. విశాఖ జిల్లాలో తొలి 3 నెలల్లో 98 కరోనా కేసులే నమోదయ్యాన్న ఆయన... లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందని డీజీపీ వెల్లడించారు. కొవిడ్ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సవాంగ్ సూచించారు. అనారోగ్య లక్షణాలున్న పోలీసుల గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

పరిపాలన రాజధానిగా విశాఖ గురించి స్పందించిన డీజీపీ

'విశాఖలో అధికారులతో రెండ్రోజులు సమావేశాలు నిర్వహించా. మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుశాఖ అప్రమత్తత గురించి చర్చించాం. కొవిడ్ సమయంలో విశాఖ పోలీసులు కష్టపడి పనిచేశారు. క్షేత్రస్థాయిలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు. అనేక రాష్ట్రాల కంటే మనం మొదట్నుంచి అప్రమత్తంగా ఉన్నాం. కొవిడ్‌పై పోరాటంలో ఏపీ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది'

- గౌతం సవాంగ్, డీజీపీ

భూములను పరిశీలించాం

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం మారుస్తున్న విషయంపై డీజీపీ పరోక్షంగా స్పందించారు. ఎలాంటి మార్పుకైనా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ సెజ్‌ పరిశీలించి అక్కడి అనుకూలతలు తెలుసుకున్నామని... గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. గ్రేహౌండ్స్ కేంద్రానికి ప్రభుత్వం ఇటీవలే భూమి కేటాయించిందని.. కేంద్రానికి ఆనందపురంలో 384 ఎకరాలు ఇచ్చారని వెల్లడించారు.

గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు

నక్సలైట్లు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. వారి రక్షణలో గంజాయి సాగు జరుగుతోంది. గంజాయి రవాణా అడ్డుకునేందుకు చర్యలు పటిష్టం చేస్తున్నాం. విశాఖలో పోలీసులు డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. గతంలో గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చేవారు. గోవాలో లాక్‌డౌన్ వల్ల బెంగళూరు నుంచి తెస్తున్నట్లు తెలుస్తోంది. యువత చెడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది- డీజీపీ గౌతం సవాంగ్

ఇదీ చదవండి:

సజ్జల దగ్గర విజయసాయి ఆస్తుల చిట్టా: వర్ల రామయ్య

Last Updated : Jul 6, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details