ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 12:08 PM IST

Updated : Jul 14, 2020, 12:52 PM IST

ETV Bharat / city

'ప్రమాదానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే'

విశాఖలో ప్రమాదానికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Devineni
దేవినేని ఉమ

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రసాయన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో సీఎం విమానాశ్రయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం.. తప్పు చేసేవాళ్లకి మరింత తోడ్పాటు ఇస్తుందనే సందేశం పంపిందని మండిపడ్డారు. న్యాయస్థానాలు తరిమితే కానీ ప్రభుత్వం అరెస్టులు చేయలేదని ఆరోపించారు.

విశాఖ, కర్నూల్​లో జరిగిన ప్రమాదాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాసిరకం మద్యం కర్నూలులో తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని విమర్శించారు. రాంకీలో ఏం జరిగిందో అసలు వాస్తవలు బయటకు రావాలని ఉమా డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చిన మాదిరే ఇతర మూడు ప్రమాదాల బాధితులకు ఇవ్వాలని ప్రభుతాన్ని కోరారు.

ఇదీ చదవండి: విశాఖ: ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Jul 14, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details