'మహిళా విముక్తి కోసం ప్రజాయుద్ధం'
మహిళలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా... ఈ నెల 8 నుంచి 14 వరకు పోరాటవారంగా పాటించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
మార్చి 8నఅంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటదినం వర్ధిల్లాలి అంటూ విశాఖఏజెన్సీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ గాలికొండ దళం పేరిట పోస్టర్లు వెలిశాయి. మహిళలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 8 నుంచి 14 వరకు పోరాట వారంగా పాటించాలనిగాలికొండ దళం పిలుపునిచ్చింది. మహిళా విముక్తి కోసం ప్రజా యుద్ధంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరింది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సొమఆదివాసి పీడిత ప్రజల ద్రోహులుగా మారారని.. అందుకే హతమార్చామనిఆంధ్రా ఒడిశా జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖలో వివరించారు. ఈ ఘటన తర్వాత అమాయకులైన గిరిజనులను అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా, అధికారపార్టీ నేతలు ఆగడాలు మరింతగా పెరుగుతూ వస్తున్నాయని ఆరోపించారు. వీటిని ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.