ప్రభుత్వం విడుదల చేసిన ఎన్హెచ్ఎం, యూపీహెచ్సీ ఉద్యోగాల భర్తీలో తమను నియమించాలని కోరుతూ విశాఖ కలెక్టరేట్ వద్ద కొవిడ్ వారియర్స్ ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు చేశారు.
నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి సేవ చేస్తే ప్రభుత్వం.. పోలీసులతో అరెస్టు చేయిస్తోందని నిరసనకారులు నినాదాలు చేశారు. కరోనా సమయంలో తమ సేవలు వాడుకొని ఇప్పుడు కరివేపాకులా తీసి పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.