ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలి: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని కోరారు. తెలుగుదేశంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నిమిత్తం ఆయన విస్తృత ప్రచారం చేశారు.

chandrbabu fiers on ycp govt
chandrbabu fiers on ycp govt

By

Published : Mar 5, 2021, 7:19 PM IST

Updated : Mar 6, 2021, 8:45 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు

విశాఖలో దందాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఏబీసీడీ పాలసీ పెట్టారని విమర్శించారు. ఏ అంటే ఎవరిపైన అయినా దాడులు చేస్తారని దుయ్యబట్టారు.

'హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇక్కడే 10 రోజులున్నా... విశాఖలో పరిస్థితి సాధారణం అయ్యాకే తిరిగివెళ్లా. ఏ ఒక్క అవకాశం వచ్చినా విశాఖకు తీసుకువచ్చా. లూలూ సంస్థ వస్తే పర్యాటకం అభివృద్ధి చెందాలనుకున్నా. విశాఖకు గతంలో ఉన్న శోభ ఇప్పుడు ఉందా? అదానీ, లూలూ సంస్థలు పారిపోయాయి. విశాఖకు పట్టిన ఏ-2 శనిని వదిలించుకోవాలి. విశాఖలో దందాలు, భూకబ్జాలు పెరిగాయి'- చంద్రబాబు, తెదేపా అధినేత

జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రకటించారు. పీలా శ్రీనివాస్​ను గెలిపిస్తే ఇంటి పన్ను పెరగదని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారుపేరు అని కొనియాడారు. హుద్‌హుద్‌ తుపాను ధాటికి విశాఖ పెద్దఎత్తున దెబ్బతిందన్న ఆయన.. ఆనాడు విశాఖ తిరిగి కోలుకుంటుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు

తుపాను వచ్చిన తర్వాత రోజే ప్రధాని విశాఖ వచ్చారని... ప్రధానితో కలిసి తాను కారులో వస్తుంటే ప్రజలు నవ్వుతూ స్వాగతం పలికారని చెప్పారు. నాడు విశాఖ ప్రజల స్వాగతం చూసి ప్రధాని ఆశ్చర్యపోయారన్నారు. విశాఖను ప్రపంచ పటంలో పెట్టామని.. నగర అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ కూడా తయారు చేశామని వెల్లడించారు. విశాఖను అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తెదేపాకే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి.. కేశినేని శ్వేత ప్రొఫైల్

Last Updated : Mar 6, 2021, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details