విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానానికి వెళ్లాలని తెదేపా నిర్ణయించింది. నిన్నటి పరిణామాలపై పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడం ఏమిటని అన్నారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న చంద్రబాబు... వైకాపా కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.
'విశాఖ వచ్చి తీరుతా.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా' - విశాఖ ఘటనపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
త్వరలోనే విశాఖలో పర్యటించి తీరుతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ఆపగలుగుతారో తానూ చూస్తానన్నారు.
విశాఖ ఘటనపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్