కరోనాపై పోరాటానికి కేంద్రం...ఏపీకి రూ.8 వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే కనీసం కొవిడ్ పోరాట యోధులకు వైకాపా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా కట్టడి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.
వైద్యులు, హౌస్ సర్జన్లు, వైద్య సిబ్బందికి జీతాలు జాప్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి...కరోనా పోరాట యోధులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.