వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న 24 ముఖ్య పథకాలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కంటే వసతి గృహ విద్యార్థులకు పెట్టే కోడిగుడ్లలో ఎక్కువ అవినీతి ఉందన్నారు. సర్వశిక్ష అభియాన్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తరహాలోనే వైకాపా పాలన సాగుతుందని దుయ్యబట్టారు.
అన్ని రంగాల్లో విఫలం: సునీల్ దియోధర్