ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగులోనూ ఉండాలని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లో ముందస్తు విధానాలు ఏమీ లేకుండా... కేవలం ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించాలనుకోవటం సరికాదన్నారు. నిరుద్యోగలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి పరీక్షకు సిద్ధమైన అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఏపీపీఎస్సీ అధికారులను కోరారు. గతంలో తెలుగు భాష కోసం పోరాడిన సీఎం చంద్రబాబు... అధికారంలోకి రాగానే తెలుగును మర్చిపోయారని ఆరోపించారు.
పోటీ పరీక్షలన్నీ తెలుగులోనే ఉండాలి: యార్లగడ్డ
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రధాన పోటీ పరీక్షలన్నీ తెలుగులో ఉండాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లో ముందస్తు విధానాలు ఏమీ లేకుండా... కేవలం ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించాలనుకోవటం సరికాదన్నారు.
ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలన్నీ తెలుగులో ఉండాలి