ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 12, 2021, 5:58 PM IST

Updated : Oct 12, 2021, 6:15 PM IST

ETV Bharat / city

'డబ్బులివ్వకుంటే.. పెట్రోలు పోసుకుంటా'.. డాక్టర్ సుధాకర్ తల్లికి మేనల్లుడు బెదిరింపు

విశాఖకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయిని చంపేస్తానంటూ ఆమె మేనల్లుడు హల్​చల్‌ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

డాక్టర్ సుధాకర్ తల్లి ఇంట్లో వ్యక్తి హల్​చల్
డాక్టర్ సుధాకర్ తల్లి ఇంట్లో వ్యక్తి హల్​చల్

విశాఖకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయిని చంపేస్తానంటూ ఆమె మేనల్లుడు హల్​చల్‌ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు...తాళాలు వేసుకుని ఇంట్లో ఉన్న విజయ్‌ని బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌ వెనుక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సహా కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని..కావేరీబాయి ఆరోపించారు. తమ భూముల్ని కొందరు ప్రముఖులు కాజేశారని.. విజయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె వెల్లడించారు.

మా భూముల్ని కొందరు ప్రముఖులు కాజేశారు.ప్రముఖులతో చేతులు కలిపి విజయ్‌ ఆరోపణలు చేస్తున్నాడు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మా భూములు కాజేశారు. విజయ్ దుర్వ్యసనాలకు లోనై బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజయ్‌ నుంచి నాకు ప్రాణభయం ఉంది. -కావేరీబాయి, డాక్టర్ సుధాకర్ తల్లి

డాక్టర్ సుధాకర్ తల్లికి మేనల్లుడు బెదిరింపు
Last Updated : Oct 12, 2021, 6:15 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details