ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 24, 2019, 7:24 PM IST

ETV Bharat / city

'సీఎం జగన్​ను విమర్శించే నైతిక అర్హత పవన్​కు లేదు'

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిని విమర్శించే నైతిక అర్హత పవన్ కల్యాణ్​కు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జగన్ దిల్లీ పర్యటనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పవన్​పై అంబటి రాంబాబు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనవసర విమర్శలు చేస్తున్నారని వైకాపా ఆరోపించింది. అమిత్​ షాను కలిసి రాష్ట్ర విభజన సమస్యల గురించి చర్చించారనీ.. ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్​ ఆలోచనను షా అభినందించారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా పవన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నేరస్థుడని ఎలా అంటారు

జగన్మోహన్​రెడ్డిపై ఉన్న కేసులు విచారణ జరుగుతుంటే నేరస్థుడని ఎలా అంటారని నిలదీశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారంతా నేరస్థులు కాదని.. వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటోన్న పవన్​కు ఆ సంగతి తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్ఏ పవన్ కల్యాణ్​ డీఎన్ఏ ఒకటే కాబట్టి ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరి కోసమో రాజకీయాలు చేయొద్దని జనసేనానికి అంబటి సూచించారు. ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెట్టి ముందు తన పార్టీలో వలసలు ఆపుకోవాలన్నారు. ప్రజలు తనను రెండుచోట్ల ఎందుకు ఓడించారో తెలుసుకోవాలని పవన్​కు చురకలు అంటించారు.

పవన్​పై అంబటి రాంబాబు విమర్శలు

ఇవీ చదవండి..

'అగ్రిగోల్డ్​ బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం ఆగదు'

ABOUT THE AUTHOR

...view details