''ఆ విషయాన్ని ప్రభుత్వమే చెప్పాలి'' - ycp
ప్రైవేటు సంస్థ ఐటీ గ్రిడ్‌కు ఓటర్ల జాబితా ఎలా వెళ్లిందనే విషయాన్ని ప్రభుత్వమే చెప్పాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు.
ఓట్లను తొలగిస్తున్నారంటూ వైకాపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో 11 వేల ఓట్లు తొలగించారనిశాసన సభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో సైతం 11 వేల 219 ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు సంస్థ ఐటీ గ్రిడ్‌కు రాష్ట్ర ఓటర్ల జాబితా ఎలా వెళ్లిందనే విషయాన్ని ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ జాబితా ఆధారంగానే తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే గోపి రెడ్డి ఆరోపించారు.