ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూలీల నిధులు సైతం అడ్డుకున్నారు: యనమల

"రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు మోదీ జగన్​తో కలిసి కుట్రలు చేస్తున్నారు. కూలీలకు ఇచ్చే ఉపాధి నిధులు సైతం అడ్డుకున్నారు. రాబడులు, వ్యయంలో అంతరాన్ని భర్తీ చేయడానికే అప్పులు చేయాల్సి వస్తోంది. తెలంగాణ, గుజరాత్, కర్ణాటకకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచి ఏపీకి ఎందుకు పెంచలేదు" ----యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

కూలీల నిధులు సైతం అడ్డుకున్నారు

By

Published : Apr 23, 2019, 4:43 PM IST

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు మోదీ జగన్​తో కలిసి కుట్రలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన రాబడులను రాకుండా ప్రతిపక్షనేత తన అనుచరులతో ఫిర్యాదులు చేయిస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పీఎంవోలో తిష్టవేసి మోదీలో రాష్ట్రంపై అపోహలు పెంచారని ఆరోపించారు. కూలీలకు ఇచ్చే ఉపాధి నిధులు సైతం అడ్డుకున్నారని చెప్పారు. రాబడులు, వ్యయంలో అంతరాన్ని భర్తీ చేయడానికే అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణ, గుజరాత్, కర్ణాటకకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచి, ఏపీకి మాత్రం మొండిచేయి చూపించారని తెలిపారు. విభజన కష్టాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామని... సీఎం చంద్రబాబు దార్శనికత వల్లే ఈ నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించడం సాధ్యమైందన్నారు.

ABOUT THE AUTHOR

...view details