విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో జరిగిన మూగజీవాల మృత్యుఘోష వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. పశుగ్రాసం పైనున్న రసాయనాలే కారణమని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా...పక్కాగా నిర్ధరణ జరగలేదు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
కుట్రకోణం దాగి ఉందా..?
ఆవుల మృతి వెనుక కుట్ర కోణం ఉందా? లేక పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నట్లు గడ్డిపైనున్న ప్రమాదకరమైన రసాయనాల వల్లే ఆవులు చనిపోయాయా ? అన్నది తేలాల్సి ఉంది. దాణాలో యూరియా వంటి ఎరువులు, ఇతర రసాయనాలు అధిక మోతాదులో కలిసినందునే మృతి చెందాయని అధికారులు భావిస్తున్నారు. అయితే మంగళవారం శవపరీక్ష నివేదిక వచ్చాకే స్పష్టత రానుంది. పూర్తిగా స్పష్టత రావాలంటే మాత్రం... ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకూ ఆగాల్సిందే. అందుకోసం మరో నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ఏ రసాయనం, ఎంత మోతాదులో కలిసిందనేది స్పష్టంగా తెలియనుంది.
రసాయన ఎరువులే కారణమా ?