దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా... దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి... దసరా కోసం ఆయా శాఖలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తూ... ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
దసరా ఏర్పాట్లు... అధికారులతో మంత్రి సమీక్ష
విజయవాడలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను... ఈనెల 25నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మంత్రి వెల్లపంల్లి శ్రీనివాస్ చెప్పారు. దసరా ఉత్సవాల నిర్వహణపై... పలు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వెల్లంపల్లి శ్రీనివాస్
ఈనెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను... ఈనెల 25నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. దుర్గగుడి అధికారుల అభ్యర్థన మేరకు దసరా ఉత్సవాలకు అసవరమయ్యే వసతులు కల్పిస్తామన్నారు. భద్రతా పరంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందన్న కలెక్టర్... భక్తులకు సేవంలందించేందుకు అదనంగా ఎన్.సి.సి కేడెట్స్ను కూడా వినియోగిస్తామన్నారు.
ఇదీ చదవండీ... అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు