రాష్ట్రంలో అంతా సజావుగా జరిగితే నేడు 30 లక్షల మంది మహిళలకు సొంత ఇంటి కల సాకారమయ్యేదని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆ కలను తెదేపా నేతలు అడ్డుకున్నారని విమర్శించారు. ఈరోజు బ్లాక్ డే అని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా పిటిషన్లు వేసి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పిటిషన్లు వేసి తెదేపా మహిళల కలను అడ్డుకుంది'
మహిళలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తెదేపా పిటిషన్లు వేసి అన్యాయం చేస్తుందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కలను తెదేపా అడ్డుకుంటుందని ఆరోపించారు.
ఇళ్ల స్థలాలపై వాసిరెడ్డి పద్మ
ముప్పై 30 లక్షల మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమమని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీ ప్రభుత్యం మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న కార్యక్రమాలపై యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని మహిళలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు.
ఇదీ చదవండి: హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు