ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజీపీగా సవాంగ్ ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు: వర్ల రామయ్య

గత ప్రభుత్వ హయంలో డీజీపీ పదవి ఇవ్వలేదని.. సవాంగ్ తెదేపా పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. డీజీపీగా సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సవాంగ్‌ను తొలగించాలని ఎస్​ఈసీని కోరారు.

సవాంగ్ డీజీపీగా ఉంటే ఎన్నికల సజావుగా జరగవు
సవాంగ్ డీజీపీగా ఉంటే ఎన్నికల సజావుగా జరగవు

By

Published : Jan 21, 2021, 4:06 PM IST

డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సవాంగ్‌ను పదవి నుంచి తొలగించాలని ఎస్ఈసీని కోరుతున్నామన్నారు. సమర్థుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలన్నారు. గత ప్రభుత్వ హయంలో డీజీపీ పదవి ఇవ్వలేదని.. సవాంగ్ తెదేపా పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారని ఆరోపించారు. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ సవాంగ్​ను హైకోర్టు మందలించిని వర్ల గుర్తు చేశారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోని సవాంగ్​ను డీజీపీ పదవి నుంచి తొలగించాలన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులను రేంజ్‌ దాటి బదిలీ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details