దళితులంటే ఊరి చివర నివసించే వారనే భావన జగన్‌లో ఉందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. శాసనసభ సాక్షిగా జగన్ దళితులను కించపరిచేలా మాట్లాడితే, వైకాపాలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన్ని ఎలా సమర్థిస్తారని వర్ల నిలదీశారు. జగన్ ప్రభుత్వం దిగివచ్చి దళితులకు న్యాయం చేసేవరకు తెదేపా తరఫున జాతీయస్థాయిలో కూడా పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
వాళ్లు జగన్‌ను ఎలా సమర్థిస్తున్నారు?: వర్ల
రాష్ట్రంలోని కోటి 20 లక్షలమంది దళితుల్లో జగన్ ప్రభుత్వానికి ఒక్క సలహాదారు కూడా కనిపించలేదా? అని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.
varla ramaiah comments on jagan