ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దు చేయాలి' - సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ నాయకుల ధర్నా

అధికారంలోకి వస్తే సీపీఎస్​ను​ రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. 8 నెలలు గడిచినా దాని ఊసే ఎత్తడం లేదని యూటీఎఫ్ నాయకులు వాపోయారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏల సాధన కోసం మార్చి 3న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.

UTF protest for cps cancellation
మాట్లాడుతున్న యూటీఎఫ్ నాయకులు

By

Published : Feb 10, 2020, 2:18 PM IST

సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏల సాధన కోసం మార్చి 3న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) నిర్ణయించింది. అధికారంలోకి వస్తే సీపీఎస్​ రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. ప్రభుత్వం ఏర్పాటుచేసి 8 నెలలు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడంలేదని యూటీఎఫ్ నాయకులు వాపోయారు. కమిటీల పేరుతో వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వెంటనే సీపీఎస్ రద్దు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కాల పరిమితి ముగిసినప్పటికీ 4సార్లు గడువు పొడిగించుకుంటూ వెళ్లడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 29న కార్డు క్యాంపెయిన్‌ చేస్తామని.. మార్చి 3న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details