- రాష్ట్రంలో కొత్తగా 1,121 కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,121 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,62,213కు చేరింది. మరణాల సంఖ్య 6,938కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా.. ఈనెల 25, 26న రాష్ట్రంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం..!
పదునైన ఆలోచనకు పనికిరాని పనిముట్లు ఓ ఆకారాన్నిచ్చాయి. సృజనాత్మకతకు వెల్డింగ్ ఊపిరి పోసింది. కళాకారుడి అపార ప్రతిభ.. ఇనుప తుక్కుకు కొత్త మెరుగులు అద్దింది. రోబో సినిమాలో చిట్టిలాగా ఈ బొమ్మలు కదల్లేవు కానీ అంతకు మించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ 'సొరంగం' నుంచే జైషే ఉగ్రవాదుల చొరబాటు
జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. నవంబర్ 19న హతమైన నలుగురు జైషే ముష్కరులు వినియోగించిన టన్నెల్‌ను గుర్తించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా?
పండగ వేళల్లో ప్రజలు కరోనా భయాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా తిరిగారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అసహనం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ములాయం సింగ్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయనతో మాట్లాడానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉందని డాక్టర్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో రికార్డు స్థాయిలో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు
భారత్‌లో విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు) ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతున్నారు. నవంబరులో అత్యధిక నెలవారీ ఎఫ్ఐఐ పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఎఫ్‌ఐఐలు రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు మన మార్కెట్లోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోహిత్‌తో మాట్లాడాకే కుదుటపడ్డా: సూర్యకుమార్
భారత జట్టులో చోటు దక్కని సందర్భంలో, రోహిత్ శర్మ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈసారి ఐపీఎల్లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వదంతులు నమ్మకండి.. రజనీ ఆరోగ్యం బాగానే ఉంది'
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల గురించి స్పందించారు ఆయన ప్రతినిధులు. తలైవా ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.