ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు సినీ ప్రముఖులు గన్నవరం చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి చార్టర్ ఫ్లైట్‌లో సినీ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, దర్శకులు రాజమౌళి, నిర్మాత సురేష్‌బాబు తదితరులు వచ్చారు. అమరావతి చేరుకున్న సినీ ప్రముఖులు.. గోకరాజు గంగరాజు అతిథి గృహానికి వెళ్లారు. మరికొందరు రోడ్డు మార్గంలో విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు ప్రధానంగా చర్చించనున్నారు.
కాసేపట్లో.. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ - టాలీవుడ్ తాజా వార్తలు
రాష్ట్రంలో చలనచిత్ర రంగం అభివృద్ధిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డితో కాసేపట్లో తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ జరగనుంది.
రాష్ట్రంలో ఉచితంగా సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ముఖ్యమంత్రికి సినీ పరిశ్రమ ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. సినిమా థియేటర్ల సమస్యలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో.. విశాఖలో సినిమా స్టూడియోలు, సినీ ల్యాబ్‌ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఇప్పటికే సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇదే అంశంపై ప్రత్యక్షంగా సీఎంతో చర్చించనున్నట్లు సమాచారం. చిరంజీవి నేతృత్వంలో మొత్తం 25 మంది వరకు సీఎంతో భేటీ కావాలని తొలుత భావించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ సంఖ్యను కుదించారు. కేవలం ఏడుగురు మాత్రమే రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
ఇదీ చదవండి: ఇవాళ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ